ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2021-10-07T18:09:35+05:30 IST

ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులపై హైకోర్టు డివిజినల్ బెంచిలో విచారణ జరిగింది. ఈనెల 4 న రూ.372 కోట్లు పంచాయతీ అకౌంట్లలో జమ చేశామని ప్రభుత్వం అఫిడవిట్ వేసింది.

ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులపై హైకోర్టులో విచారణ

అమరావతి: ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులపై గురువారం హైకోర్టు డివిజినల్ బెంచిలో విచారణ జరిగింది. ఈనెల 4 న రూ.372 కోట్లు పంచాయతీ అకౌంట్లలో జమ చేశామని ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. గతంలో పంచాయతీ అకౌంట్లలో జమ చేసిన రూ.1100 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించామని ప్రభుత్వం పేర్కొంది. ఇందులో కేవలం రూ.60 కోట్లు మాత్రమే పంచాయితీ అకౌంట్లలో ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొంది. విజయదశమిలోపు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని  హైకోర్టు ఆదేశించింది. బిల్లుల చెల్లింపులో 20 నుంచి 26 శాతం విజిలెన్స్ విచారణ పేరుతో మినహా ఇస్తున్నారని  న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. బిల్లులో 20 శాతం మినహాయింపును చేస్తూ ఇచ్చిన జీవోను సింగిల్ జడ్జి కొట్టి వేశారని ధర్మాసనానికి న్యాయవాదులు  వివరించారు. దసరా సెలవుల అనంతరం ఈ అంశంపై విచారణ జరుపుతామని హైకోర్టు చెప్పింది. బిల్లులు మొత్తాన్ని ఇప్పించినందుకు హైకోర్టుకు పిటిషనర్ల తరపున న్యాయవాదులు ధన్యవాదాలు తెలియజేశారు. 

Updated Date - 2021-10-07T18:09:35+05:30 IST