అమరావతి: విజయవాడ డ్రగ్స్ కేసు తవ్వినకొద్దీ డొంక కదులుతోంది. డ్రగ్స్ వ్యవహారంలో మరింత లోతుగా దర్యాప్తు చేయాలని డీఆర్ఐ అధికారులు నిర్ణయించారు. గతంలో ఇటువంటి కన్సైన్మెంట్లు వచ్చాయా అనే కోణంలో ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. దీంతో సెంట్రల్ విజిలెన్స్, నార్కోటిక్ బ్యూరో, కస్టమ్స్ అండ్ ఎక్సైజ్, నేవీ ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. డ్రగ్స్ విలువ రూ. 21 వేల కోట్లుగా అంచనా వేశారు. సుధాకర్ దంపతులను చెన్నైలో అదుపులోకి తీసుకున్న అధికారులు గుజరాత్‌కు తరలించి.. కోర్టులో హాజరు పర్చగా సుధాకర్ దంపతులను పదిరోజుల డీఆర్ఐ కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. మనీలాండరింగ్ కోణంపై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.