తిరుపతిలో Omicron కేసు నమోదు కాలేదు.. : ఏపీ వైద్య ఆరోగ్య శాఖ క్లారిటీ..

ABN , First Publish Date - 2021-12-12T23:50:53+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరోజే రెండు ఒమైక్రాన్ కేసులు నమోదు అయ్యాయని ఇవాళ ఉదయం నుంచి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం విదితమే.

తిరుపతిలో Omicron కేసు నమోదు కాలేదు.. : ఏపీ వైద్య ఆరోగ్య శాఖ క్లారిటీ..

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరోజే రెండు ఒమైక్రాన్ కేసులు నమోదు అయ్యాయని ఇవాళ ఉదయం నుంచి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం విదితమే. లండన్ నుంచి వచ్చిన విజయనగరం వాసికి ఒకరికి.. తిరుపతిలో మరో వ్యక్తికి వైరస్ లక్షణాలు బయటపడ్డాయని ఇద్దరికీ పాజిటివ్ అని తేలినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 34 సంవత్సరాల ఎన్‌ఆర్‌ఐ ఇది వరకే రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోగా.. ఈనెల 8న ఢిల్లీ నుంచి తిరుపతికి వచ్చి జీనమ్ టెస్ట్ చేయగా ఒమైక్రాన్ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారించారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలతో చిత్తూరు ప్రజలు ముఖ్యంగా తిరుపతి ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో ఈ వార్తలపై వైద్య ఆరోగ్య శాఖ స్పందించి క్లారిటీ ఇచ్చుకుంది.


క్లారిటీ.. 

తిరుపతిలో ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు వస్తున్న వార్తలు నిజం కాదని ఆరోగ్యశాఖ తేల్చేసింది. ఇటువంటి రూమర్లు ప్రచారం చేయొద్దని.. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే తగు చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆరోగ్యశాఖ ఒకింత హెచ్చరించింది. అంతేకాదు.. ఇలాంటి రూమర్లు చేసే వారు తగిన బాధ్యత కూడా వహించాల్సి వస్తుందని ఆరోగ్యశాఖ తెలిపింది.

Updated Date - 2021-12-12T23:50:53+05:30 IST