Advertisement
Advertisement
Abn logo
Advertisement

చంద్రబాబుకు చిన్న మెదడు చిట్లింది: విప్ శ్రీనివాసులు

కడప: టీడీపీ అధినేత చంద్రబాబుపై రైల్వేకోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు సంచలన ఆరోపణలు చేసారు. చంద్రబాబుకు చిన్న మెదడు చిట్లినట్టుందని ఆయన వ్యాఖ్యానించారు.  చంద్రబాబు డ్రగ్స్ వాడుతున్నాడా అనే అనుమానం ఉందన్నారు. చంద్రబాబుకు నార్కో పరీక్ష చేయాలని విప్  శ్రీనివాసులు డిమాండ్ చేసారు. అధికార దాహంతో, అధికార మదంతో ఢిల్లీకి వెళ్లి ఆర్టికల్ 356 అమలు చేయాలంటున్నారని ఆయన ఆరోపించారు. జగన్‌పై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో డ్రగ్స్ అంటూ విషాన్ని కక్కుతున్నారన్నారు. వ్యవస్థలను  చంద్రబాబు మేనేజ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బద్వేల్ ఉపఎన్నికలో బీజేపీని చంద్రబాబు వెనుక ఉండి నడిపిస్తున్నారని విప్ కొరముట్ల శ్రీనివాసులు ఆరోపించారు.


Advertisement
Advertisement