ఏపీ, ఐఎ్‌సబీ ఒప్పందం

ABN , First Publish Date - 2020-08-06T07:09:21+05:30 IST

కొవిడ్‌ అనంతరం ఆర్థిక వ్యవస్థ, వృద్ధి తీరుతెన్నులను తెలుసుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎ్‌సబీ) సేవలు పొందనుంది...

ఏపీ, ఐఎ్‌సబీ ఒప్పందం

  • ‘పాలసీ ల్యాబ్‌’ ఏర్పాటు ఆర్థిక వృద్ధిపై పర్యవేక్షణ


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కొవిడ్‌ అనంతరం ఆర్థిక వ్యవస్థ, వృద్ధి తీరుతెన్నులను తెలుసుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎ్‌సబీ) సేవలు పొందనుంది. ప్రభుత్వంలోని వివిధ ఆర్థిక సంబంధ విభాగాలతో ఐఎ్‌సబీ కలిసి పని చేయడానికి ఏపీ ఎకనమిక్‌ డెవల్‌పమెంట్‌ బోర్డు, ఐఎ్‌సబీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఆర్థిక రికవరీ, ‘విశాఖపట్నం’ ప్రాజెక్ట్‌, రాయలసీమలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగం మొదలైన వాటిపై ఐఎ్‌సబీ పని చేస్తుంది. డేటా అనలిటిక్స్‌, ఈ-గవర్నెన్స్‌, నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమాలపై కృషి చేస్తుంది. ఒప్పందానికి అనుగుణంగా ‘జీఓఏపీ-ఐఎ్‌సబీ పాలసీ ల్యాబ్‌’ను ఏర్పాటు చేస్తారు. వ్యూహాత్మక ప్రణాళిక, విధాన విశ్లేషణ, డేటా అనలిటిక్స్‌, వృద్ధికి అవసరమైన క్రియాశీల పరిశోధన మొదలైన వాటికి ఈ ల్యాబ్‌ నాలెడ్జ్‌ బ్యాంకును సృష్టిస్తుంది. 

Updated Date - 2020-08-06T07:09:21+05:30 IST