విదేశీ ప్రయాణికులకు ఏపీ సర్కార్ కొత్త‌ మార్గదర్శకాలు

ABN , First Publish Date - 2020-08-27T14:24:23+05:30 IST

వందే భారత్, ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ బబుల్ విమానాల్లో వచ్చే ప్రయాణికులకు ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కోవిడ్-19 నేపథ్యంలో విదేశాల్లో ఉన్న భారతీయులను తిరిగి రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వందే భారత్ మిషన్ పేరుతో విమానాలను నడుపుతోంది.

విదేశీ ప్రయాణికులకు ఏపీ సర్కార్ కొత్త‌ మార్గదర్శకాలు

అమరావతి: వందే భారత్, ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ బబుల్ విమానాల్లో వచ్చే ప్రయాణికులకు ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కోవిడ్-19 నేపథ్యంలో విదేశాల్లో ఉన్న భారతీయులను తిరిగి రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వందే భారత్ మిషన్ పేరుతో విమానాలను నడుపుతోంది. ఈ వందే భారత్ మిషన్ ద్వారానే విదేశాల్లో ఉన్న వారిని సొంత ప్రదేశాలకు తిరిగి వచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు 24 నాటికి కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ ద్వారా 11,82,129 మంది ప్రయాణికులను భారత్‌కు రప్పించింది. ఈ నేపథ్యంలో వందే భారత్ మిషన్, ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ బబుల్ విమానాల్లో ప్రయాణం చేసే వారికి కేంద్ర పౌర విమానయాన శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసినట్లు కోవిడ్-19 స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు.


విదేశీ ప్రయాణికులకు మార్గదర్శకాలు:

* ప్రయాణానికి ఏ వర్గానికి చెందిన వారు అర్హులు అనేదాన్నికేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తుంది.


* విదేశీ ప్రయాణాలకు అర్హులైన వర్గానికి చెందిన వారి జాబితా పౌర విమానయాన మంత్రిత్వశాఖ వెబ్ సైట్ లో ఉంచుతారు.


* అలాంటి వ్యక్తులు అవసరమైన పత్రాలు పౌరవిమానయాన శాఖకు లేదా సంబంధిత అధీకృత ఏజెన్సీకి దరఖాస్తు చేసుకుంటారు


* ప్రయాణం పౌరవిమానయాన శాఖ అనుమతించిన నాన్ షెడ్యూల్డ్ విమానాల్లోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది.


* విదేశీ ప్రయాణానికి వెళ్లే నౌకలపై పనిచేయాలనుకునే భారత నావికులు, సిబ్బంది తమ యాజమాన్యాలు ఏర్పాటు చేసిన విమానాలు లేదా పౌర విమానయాన శాఖ నడిపే నాన్ షెడ్యూల్డ్ విమానాల్లో ప్రయాణించాల్సి ఉంటుంది


* ప్రయాణ ఖర్చులను ప్రయాణికులే భరించాలి.


* ప్రయాణికులందరూ థర్మల్ స్కానింగ్ చేయించుకోవడం తప్పనిసరి. ఎలాంటి లక్షణాలు లేని వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు.


* విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో విమాన సిబ్బంది, అందరు ప్రయాణికులు మాస్కులు ధరించడంతోపాటు చేతులను పరిశుభ్రంగా ఉంచడం లాంటి నిబంధనలు పాటించడం తప్పనిసరి. 


* అన్ని ఎయిర్ ట్రాన్స్పోర్ట్ బబుల్స్ ప్రయాణికుల వివరాలు ఆయా విమానయాన సంస్థలు సిద్ధం చేసి ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు ఒక కాపీతో సహా సంబంధిత భారత రాయబార కార్యాలయాలకు పంపాలి.


* విదేశాల నుంచి వస్తున్న అన్ని విమానాలు/ నౌకల వివరాలు కనీసం రెండు రోజుల ముందుగా విదేశాంగ మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆన్లైన్ లో ప్రచురించాల్సి ఉంటుంది.


* ప్రయాణికులందరూ తమ ప్రయాణానికి తామే బాధ్యులమని హామీ పత్రం సమర్పించాల్సి ఉంటుంది.


* విమానాలు, నౌకల్లో ప్రయాణిస్తున్న సమయంలో విమాన సిబ్బందితోపాటు ప్రయాణికులు అందరూ మాస్కులు ధరించడం, చేతుల పరిశుభ్రత పాటించడం తప్పనిసరి.


* దేశ సరిహద్దుల ద్వారా ప్రవేశించే ప్రయాణికులు కూడా ఇదే తరహా నిబంధనలు పాటించాలి.


* ఆరోగ్య మంత్రిత్వశాఖ జారీ చేసిన అన్ని నిబంధనలు, క్వారంటైన్ మార్గదర్శకాలు పాటించాలి.

Updated Date - 2020-08-27T14:24:23+05:30 IST