AP News: ఏపీ అణు ఇంధనం అక్రమ ఎగుమతులపై కేంద్రం ఆగ్రహం

ABN , First Publish Date - 2022-08-03T23:56:46+05:30 IST

ఏపీ అణు ఇంధనం అక్రమ ఎగుమతులపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. మోనజైట్ అక్రమ ఎగుమతులపై విచారణకు కేంద్ర అణు ఇంధన శాఖ ఆదేశించింది.

AP News: ఏపీ అణు ఇంధనం అక్రమ ఎగుమతులపై కేంద్రం ఆగ్రహం

ఢిల్లీ: ఏపీ అణు ఇంధనం అక్రమ ఎగుమతులపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. మోనజైట్ అక్రమ ఎగుమతులపై విచారణకు కేంద్ర అణు ఇంధన శాఖ ఆదేశించింది. అక్రమ ఎగుమతులపై  కేంద్ర గనుల శాఖ ఫిర్యాదులు వచ్చాయి. దీంతో దర్యాప్తు చేయాలని ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్‌కు ఆదేశించారు. బీచ్ శాండ్ మినరల్స్ మైనింగ్‌కు 17 ప్రాంతాల్లో అనుమతివ్వాలని ఏపీ కేంద్రాన్ని కోరింది. కేవలం రెండు చోట్ల మాత్రమే కేంద్రం అనుమతిచ్చింది. పర్యావరణ కాలుష్యం, మైనింగ్ చట్టాల ఉల్లంఘన, మోనజైట్ అక్రమ ఎగుమతులపై కేంద్ర గనుల శాఖ ఫిర్యాదు చేసింది. దీంతో గనుల శాఖ ఫిర్యాదును అణు ఇంధన శాఖ సీరియస్‌గా తీసుకుంది. మోనజైట్ ఉత్పత్తి పరిణామం, రవాణా, అమ్మకాలపై పూర్తి డేటా ఉన్నందున.. దర్యాప్తు చేయాలని ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్‌కు ఆదేశించారు. లోక్‌సభలో ఎంపీ కోటగిరి శ్రీధర్‌ ప్రశ్నతో కేంద్రం నిజాలను బయటపెట్టింది.

Updated Date - 2022-08-03T23:56:46+05:30 IST