ఏపీ పొగాకు రైతులకు గుడ్ న్యూస్

ABN , First Publish Date - 2020-07-01T03:56:18+05:30 IST

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వమే పొగాకు కొనుగోళ్లు చేయాలని....

ఏపీ పొగాకు రైతులకు గుడ్ న్యూస్

అమరావతి: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వమే పొగాకు కొనుగోళ్లు చేయనుంది. బుధవారం నుంచి పొగాకు కొనుగోళ్లు చేపడుతున్నట్లు మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేపడతామని ఆయన చెప్పారు. తొలి విడత పొగాకు ఒంగోలులోని 1, 2 కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు ప్రారంభిస్తామన్నారు. ఎఫ్3, ఎఫ్4, ఎఫ్5, ఎఫ్8, ఎఫ్9 లోగ్రేడ్ పొగాకు కొనుగోళ్లు ప్రారంభిస్తామని చెప్పారు.  క్రమంగా  అన్ని ప్రాంతాల్లో కూడా కొనుగోళ్లు చేపడతామని తెలిపారు. పొగాకు బోర్డు చెప్పిన దాని కంటే అధిక మొత్తానికి కొనుగోళ్లు చేపడతామని మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. 

Updated Date - 2020-07-01T03:56:18+05:30 IST