అమరావతి: గృహ నిర్మాణంలో ఓటీఎస్ పథకం కింద రూ. 10 వేలు చెల్లించాలని లబ్ధిదారులపై ప్రభుత్వం ఒత్తిడి పెంచింది. రూ.10 వేలు చెల్లించని లబ్ధిదారులు, కుటుంబ సభ్యులకు డిసెంబర్ పెన్షన్ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలను ఉల్లంఘించిన వాలంటీర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మొత్తం వసూలుకు వాలంటీర్లనే బాధ్యులని చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. కుటుంబ సభ్యుల పెన్షన్, రైస్ కార్డ్ నెంబరు, కుటుంబంలో ఎవరైన ప్రభుత్వ ఉద్యోగి , వాలంటీర్లుగాని ఉంటే వారి వివరాలు తీసుకోవలసినదిగా ఆదేశాలు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో వాలంటీర్లకు గ్రామ సచివాలయ సిబ్బంది ఆదేశాలు ఇచ్చింది. ఈ లిఖిత పూర్వక ఆదేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.