కప్పు ‘టీ’ కంటే.. తక్కువ ధరకు ఏపీలో సినిమా టికెట్

‘‘నో బెనిఫిట్ షోస్, నో ఎక్స్‌ట్రా షోస్, నో టికెట్ హైక్స్.. కేవలం నాలుగంటే నాలుగే ఆటలు. టికెట్లను కూడా ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో అమ్ముతుంది..’’.. ఇటీవల ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఏపీ సినిమాస్ రెగ్యులరైజేషన్ ఎమెండ్మెంట్ బిల్లులో ఉంది ఇదే. ఈ బిల్లు ప్రకారం ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల కొత్త రేట్లను బుధవారం ప్రకటించింది. ఈ రేట్లను గమనిస్తే, ఏపీలో సినిమా టికెట్ ధర.. కప్పు ‘టీ’ ధర కంటే తక్కువ ఉండటం గమనార్హం. ఈ రేట్లతో సినిమా నిర్మాతల పరిస్థితి ఏమో గానీ.. థియేటర్ల వ్యవస్థ మాత్రం భారీగా నష్టపోవడం ఖాయం. ఈ రేట్లు చూసిన థియేటర్ల యజమానులు.. వారి థియేటర్లని సినిమాలకు కాకుండా.. కోళ్ల ఫారాలకు అద్దెకు ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. అలా ఉన్నాయి టికెట్ల ధరలు. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన సినిమా టికెట్ల కొత్త ధరల ప్రకారం అత్యంత కనిష్ట ధర రూ.5 కాగా, అత్యంత గరిష్ట ధర రూ.250గా ప్రకటించారు.

టికెట్ల రేట్ల వివరాలు ఇలా ఉన్నాయి:

మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో...

మల్టీప్లెక్సు- 

ప్రీమియం రూ.250, 

డీలక్స్ రూ.150, 

ఎకానమీ రూ.75


ఏసీ/ఎయిర్ కూల్- 

ప్రీమియం రూ.100, 

డీలక్స్ రూ.60, 

ఎకానమీ రూ.40


నాన్ ఏసీ- 

ప్రీమియం రూ.60, 

డీలక్స్ రూ.40, 

ఎకానమీ రూ.20


మున్సిపాలిటీ ప్రాంతాల్లో...

మల్టీప్లెక్స్- 

ప్రీమియం రూ.150 

డీలక్స్ రూ.100 

ఎకానమీ రూ.60


ఏసీ/ఎయిర్ కూల్- 

ప్రీమియం రూ.70 

డీలక్స్ రూ.50 

ఎకానమీ రూ.30


నాన్ ఏసీ- 

ప్రీమియం రూ.50 

డీలక్స్ రూ.30 

ఎకానమీ రూ.15


నగర పంచాయతీల్లో...

మల్టీప్లెక్స్- 

ప్రీమియం రూ.120 

డీలక్స్ రూ.80

ఎకానమీ రూ.40


ఏసీ/ఎయిర్ కూల్- 

ప్రీమియం రూ.35 

డీలక్స్ రూ.25 

ఎకానమీ రూ.15


నాన్ ఏసీ- 

ప్రీమియం రూ.25 

డీలక్స్ రూ.15 

ఎకానమీ రూ.10


గ్రామ పంచాయతీ ప్రాంతాల్లో...

మల్టీప్లెక్స్-  

ప్రీమియం రూ.80 

డీలక్స్ రూ.50 

ఎకానమీ రూ.30


ఏసీ/ఎయిర్ కూల్- 

ప్రీమియం రూ.20 

డీలక్స్ రూ.15

ఎకానమీ రూ.10


నాన్ ఏసీ- 

ప్రీమియం రూ.15 

డీలక్స్ రూ.10

ఎకానమీ రూ.5


Advertisement