అన్‌లాక్ 3.0 అమలుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

ABN , First Publish Date - 2020-08-05T20:46:35+05:30 IST

అమరావతి: అన్‌లాక్ 3.0 అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో అన్‌లాక్ ప్రక్రియ ఉండనుంది.

అన్‌లాక్ 3.0 అమలుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

అమరావతి: అన్‌లాక్ 3.0 అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో అన్‌లాక్ ప్రక్రియ ఉండనుంది. ఆగస్టు 31 వరకు విద్యాసంస్థలకు అనుమతులు నిరాకరించింది. సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, బార్‌లకు అనుమతినివ్వలేదు. తగిన జాగ్రత్తలతో యోగ ట్రైనింగ్ సెంటర్‌లు, జిమ్‌లకు నేటి నుంచి అనుమతి ఇవ్వనుంది. స్వతంత్ర దినోత్సవ వేడుకలు భౌతిక దూరం పాటిస్తూ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. కంటోన్మెంట్ జోనుల్లో ఈ నెలలో 31 వరకు లాక్‌డౌన్ ఉంటుందని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.

Updated Date - 2020-08-05T20:46:35+05:30 IST