కొత్త వివాదానికి ఏపీ ప్రభుత్వం తెరలేపింది: Buddha Prasad

ABN , First Publish Date - 2021-07-19T18:22:05+05:30 IST

తెలుగు భాషా సంస్కృతులపై ప్రభుత్వం అవగాహనలేమితో వ్యవహరిస్తోందని మాజీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధ ప్రసాద్‌ విమర్శించారు.

కొత్త వివాదానికి ఏపీ ప్రభుత్వం తెరలేపింది: Buddha Prasad

విజయవాడ: తెలుగు భాషా సంస్కృతులపై ప్రభుత్వం అవగాహనలేమితో వ్యవహరిస్తోందని మాజీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధ ప్రసాద్‌ విమర్శించారు. తెలుగు- సంస్కృత అకాడమీ సమస్యను పరిష్కరించకుండానే కొత్త వివాదానికి ఏపీ ప్రభుత్వం తెరలేపిందని ఆయన తప్పుబట్టారు. కొత్తగా సాహిత్య, కళలు, చరిత్ర అకాడమీలకు సంబంధం లేనివారిని అధ్యక్షులుగా ప్రకటించారని, ఏ జాతి ఔన్నత్యం అయినా ఆ జాతి సంస్కృతి, సాహిత్యంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఇతర రాష్ట్రాల అకాడమీల అధ్యక్షులుగా విశిష్ట వ్యక్తులున్నారని గుర్తుచేశారు. తెలుగు భాషా సంస్కృతుల విధ్వంసానికి ప్రభుత్వమే పూనుకుంటే... చూస్తూ కూర్చోవడం వల్ల జాతి అస్థిత్వమే ప్రశ్నార్థకమవుతుందని మండలి బుద్ధ ప్రసాద్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-07-19T18:22:05+05:30 IST