ప్రభుత్వ ఉద్యోగినులకు ఏపీ సర్కార్‌ నజరానా

ABN , First Publish Date - 2021-03-09T00:47:48+05:30 IST

మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగినులకు ఏపీ సర్కార్‌

ప్రభుత్వ ఉద్యోగినులకు ఏపీ సర్కార్‌ నజరానా

అమరావతి: మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగినులకు ఏపీ సర్కార్‌ నజరానా ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగినులకు ఇపుడు ఉన్న సాధారణ సెలవులను 15 నుంచి 20 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో  ప్రభుత్వ ఉద్యోగినులలో ఆనందం వ్యక్తం అవుతోంది. 


గతంలో కూడా ఏపీ సర్కార్ మహిళల అభ్యున్నతి కోసం కొన్ని పథకాలను ప్రవేశ పెట్టింది. అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, కాపు నేస్తం మహిళల పేరిట ఇళ్ల స్థలం, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్లు వంటి పథకాలను అమలు పరుస్తోంది. ప్రతి రంగంలోనూ మహిళలు అభివృద్ధి చెందాలని ప్రభుత్వం భావిస్తోంది. చదువులకు పేదరికం అడ్డుకాకూడదనే అమ్మఒడి పథకం తీసుకొచ్చింది. మహిళలపై వేధింపుల నిరోధానికి ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లో కమిటీలను ఏర్పాటు చేయనుంది. ప్రతి పోలీస్‌స్టేషన్‌లోనూ మహిళా హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేస్తుంది. 

Updated Date - 2021-03-09T00:47:48+05:30 IST