అమరావతి: గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. తొలి దశలో 51 గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించనుంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వికేంద్రీకరణలో భాగంగా కార్యాచరణను రూపొందించింది. త్వరలో గ్రామ సచివాలయాల సిబ్బందికి రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ద్వారా శిక్షణ ఇప్పించనుంది.