Supreme Courtలో ఏపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురు

ABN , First Publish Date - 2022-07-18T17:00:32+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌(Andhrapradesh)లో కోవిడ్ నిధులు పక్కదారి పట్టించిన వ్యవహారంపై సుప్రీంకోర్టు(Supreme Court)లో విచారణ జరిగింది.

Supreme Courtలో ఏపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురు

Delhi: ఆంధ్రప్రదేశ్‌(Andhrapradesh)లో కోవిడ్ నిధులు పక్కదారి పట్టించిన వ్యవహారంపై సుప్రీంకోర్టు(Supreme Court)లో విచారణ జరిగింది. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వా(AP Government)నికి మరోసారి చుక్కెదురైంది. పిడి ఖాతాలకు మళ్ళించిన కొవిడ్ నిధులను తిరిగి రెండు వారాల్లో ఎస్డీఆర్ఎఫ్(SDRF) ఖాతాలోకి జమ చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని జస్టిస్ ఎం.ఆర్ షా(M.R. Shah) ధర్మాసనం ఆదేశించింది. పిడి ఖాతాల్లోకి మళ్లించిన సుమారు 11 వందల కోట్లను ఎస్‌డీఆర్‌ఎఫ్ ఖాతాలోకి జమ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కరోనా పరిహారం అందలేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే నాలుగు వారాల్లో ఫిర్యాదును పరిష్కరించాలని సుప్రీంకోర్టు సూచించింది.

Updated Date - 2022-07-18T17:00:32+05:30 IST