పరిహారం ఇవ్వాలని మరోసారి AP Governmentను కోరిన సత్యంబాబు

ABN , First Publish Date - 2022-05-16T22:10:47+05:30 IST

పరిహారం ఇవ్వాలని మరోసారి ఏపీ ప్రభుత్వాన్ని బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా కేసులో నిర్దోషిగా బయటపడ్డ సత్యంబాబు కోరాడు.

పరిహారం ఇవ్వాలని మరోసారి AP Governmentను కోరిన సత్యంబాబు

అమరావతి: తనకు పరిహారం ఇవ్వాలని మరోసారి ఏపీ ప్రభుత్వాన్ని సత్యంబాబు కోరాడు. విద్యార్థిని ఆయేషా మీరా కేసులో కోర్టు తనను నిర్దోషిగా ప్రకటించిందని పరిహారం ఇవ్వాలని, స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌ను సత్యంబాబు కోరారు. 2 ఎకరాల సాగు భూమి, రూ.10 లక్షల పరిహారం సత్యంబాబు కోరాడు. చేయని నేరానికి 9 ఏళ్లు జైలుశిక్ష అనుభవించానని, ప్రభుత్వమే న్యాయం చేయాలని సత్యంబాబు కోరాడు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో సత్యంబాబును హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే. దళితుడైన సత్యంబాబును పోలీసులు ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని తేల్చింది. సత్యంబాబుకు కింది కోర్టు విధించిన జీవితఖైదు, జరిమానాలను రద్దు చేసింది. సత్యంబాబుకు ఖర్చుల కింద రూ.లక్ష చెల్లించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 

Updated Date - 2022-05-16T22:10:47+05:30 IST