ఉద్యోగుల జీతాల ప్రాసెసింగ్‌పై ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు

ABN , First Publish Date - 2022-01-31T02:20:46+05:30 IST

ఉద్యోగుల జీతాల ప్రాసెసింగ్‌పై ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్‌ చేసే బాధ్యతను డీడీఓల కంటే

ఉద్యోగుల జీతాల ప్రాసెసింగ్‌పై ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు

అమరావతి: ఉద్యోగుల జీతాల ప్రాసెసింగ్‌పై ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్‌ చేసే బాధ్యతను డీడీఓల కంటే పైస్థాయి అధికారులకు అప్పగించింది. ఈ మేరకు వివిధ జిల్లాల కలెక్టర్లు, హెచ్‌ఓడీలు ఉత్తర్వులు జారీచేశారు. సర్వీస్ రిజిస్ట్రార్‌ లేక పలు జిల్లాల్లో బిల్లుల ప్రాసెసింగ్‌లో అంతరాయం కలిగింది. బిల్లులు ప్రాసెసింగ్‌ చేయలేమని జిల్లా ట్రెజరీ అధికారులకు ఉన్నతాధికారుల లేఖలు రాశారు. కొత్త జీతాలు వద్దంటూ ఉద్యోగుల లేఖలు ఇస్తున్నారని అధికారులు తెలిపారు. నేడు సెలవు అయినా బిల్లులు ప్రాసెస్‌ చేసేందుకు అధికారులు యత్నించారు. ప్రాసెస్ కాని బిల్లుల విషయంలో అధికారాలను బదలాయిస్తూ కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. సాంకేతిక ఇబ్బందుల కారణంగా  బిల్లుల ప్రాసెసింగ్ పూర్తికాలేదు.


కొత్త పీఆర్సీ అమలు విషయంలో ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయని ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆర్థికశాఖ ప్రత్యేక  ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం 6గంటల్లోపు కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల వేతనాలు ప్రాసెస్‌ చేయాలని డెడ్‌లైన్‌ విధిస్తూ ఆయన ఉదయం ఒక మెమో జారీ చేశారు. డెడ్‌లైన్‌ లోపు తమ ఆదేశాలు పాటించని ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డీటీఏ, పీఏవో, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కొత్త పేస్కేళ్ల ప్రకారం వేతనాలు ప్రాసెస్‌ చేయాలంటూ నాలుగు రోజుల నుంచీ రావత్‌ నిత్యం మెమోలు జారీచేస్తున్నా మెజారిటీ డీడీవోలు, ఎస్టీవోలు ఖాతరు చేయడం లేదు. శనివారం వరకు 30శాతం వేతనాల బిల్లులు కూడా ప్రాసెస్‌ కాలేదు. దీంతో శనివారం ఏకంగా తీవ్రమైన హెచ్చరికలతో కూడిన మెమోలను రావత్‌ జారీ చేశారు. అయితే ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయడానికి తమకు మరింత సమయం కావాలని కొందరు ట్రెజరీ అధికారులు కోరారు.

Updated Date - 2022-01-31T02:20:46+05:30 IST