AP In Deep Debt: మరో రెండు వేల కోట్లు అప్పు తీసుకున్న ఏపీ.. రిజర్వ్ బ్యాంకు వద్ద సెక్యూరిటీ బాండ్ల వేలం

ABN , First Publish Date - 2022-05-17T20:39:24+05:30 IST

జగన్ సర్కార్ అప్పులకు అంతూపొంతూ ఉండటం లేదు. సంక్షేమ పథకాల అమలుకు ఆపసోపాలు పడుతున్న జగన్ సర్కార్ తాజాగా..

AP In Deep Debt: మరో రెండు వేల కోట్లు అప్పు తీసుకున్న ఏపీ.. రిజర్వ్ బ్యాంకు వద్ద సెక్యూరిటీ బాండ్ల వేలం

అమరావతి: జగన్ సర్కార్ అప్పులకు అంతూపొంతూ ఉండటం లేదు. సంక్షేమ పథకాల అమలుకు ఆపసోపాలు పడుతున్న జగన్ సర్కార్ తాజాగా మరో రెండు వేల కోట్ల అప్పు చేసింది. రిజర్వు బ్యాంకు వద్ద సెక్యూరిటీ బాండ్లను వైసీపీ ప్రభుత్వం వేలం వేసింది. వెయ్యి కోట్లు 8 సంవత్సరాల కాలానికి 7.63 శాతం వడ్డీతో వేలం వేసింది. మరో వెయ్యి కోట్లకు ఐదు సంవత్సరాల కాలానికి 7.46 శాతం వడ్డీతో బాండ్ల వేలం జరిగింది. గత వారం రోజుల్లో ఐదు వేల కోట్ల రూపాయలు రుణాన్ని ఏపీ ప్రభుత్వం సేకరించింది. ఎఫ్‌ఆర్‌బిఎం కింద రూ.36 వేల కోట్లకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే రూ.5 వేల కోట్లను సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రుణంగా జగన్ సర్కార్ సమీకరించింది. మరో 3 నెలల్లో రూ.36 వేల కోట్లు పరిమితి పూర్తయ్యే అవకాశం ఉన్న ఈ తరుణంలో మళ్లీ అప్పు చేసింది.

Updated Date - 2022-05-17T20:39:24+05:30 IST