దమ్మాలపాటి కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-09-21T23:12:15+05:30 IST

దమ్మాలపాటి కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

దమ్మాలపాటి కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఢిల్లీ: మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌ కేసులో సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. దమ్మాలపాటిపై ఏసీబీ దర్యాప్తు నిలిపివేయాలంటూ ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో  ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. ఒకట్రెండు రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.


దమ్మాలపాటి శ్రీనివాస్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. మామ, బావమరిది ద్వారా కృష్ణా జిల్లాలో ఆస్తులు కొనుగోలు చేశారంటూ ఏసీబీ అభియోగాలు నమోదు చేసింది. 2014 జూన్ నుంచి డిసెంబర్ వరకు ఆస్తులు కొనుగోలు చేశారని ఏసీబీ వివరించింది. 2015-16లో భార్య పేరిట దమ్మాలపాటి శ్రీనివాస్ ఆస్తులు కొనుగోలు చేశారని కూడా ఏసీబీ తెలిపింది. రాజధాని భూముల విషయంలో జగన్ ప్రభుత్వం రాజకీయ వ్యూహం రచిస్తోంది. ఏసీబీ విచారణ పేరుతో కొందరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌పై గురిపెట్టింది. రాజధాని భూముల కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తోంది. 


అమరావతి భూముల వ్యవహారంలో హైకోర్టులో దమ్మాలపాటి శ్రీనివాస్‌ హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి చర్యలు నిలిపివేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా.. ఎఫ్‌ఐఆర్‌లోని సమాచారాన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రసారం చేయకూడదని హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది.

Updated Date - 2020-09-21T23:12:15+05:30 IST