AP ఈసెట్ ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2022-08-10T18:44:27+05:30 IST

ఏపీ ఈసెట్ ఫలితాలు(AP ESET Results) బుధవారం ఉదయం విడుదలయ్యాయి.

AP ఈసెట్ ఫలితాలు విడుదల

విజయవాడ (Vijayawada): ఏపీ ఈసెట్ ఫలితాలు(AP ESET Results) బుధవారం ఉదయం విడుదలయ్యాయి. ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి (Hemachandra Reddy) విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఫలితాల్లో 92.36 శాతం ఉత్తీర్ణత నమోదైందన్నారు. ఈ ఫలితాల్లో కూడా బాలికలే పై చేయి సాధించారన్నారు. బాలురు 91.44 శాతం, బాలికలు 95.68 శాతం ఉత్తీర్ణులయ్యారన్నారు. మొత్తం 33,657 మంది విద్యార్థులు అర్హత సాధించారని హేమచంద్రారెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2022-08-10T18:44:27+05:30 IST