సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-01-25T05:44:11+05:30 IST

రాష్ట్రంలోని అన్ని ఇంజనీరింగ్‌ శాఖల్లో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించా లని ఆంధ్రప్రదేశ్‌ ఇంజనీర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ప్రభు త్వాన్ని కోరింది.

సమస్యలు పరిష్కరించాలి
జూమ్‌ యాప్‌లో మాట్లాడుతున్న జేఏసీ నాయకులు

ప్రభుత్వాన్ని కోరిన ఏపీ ఇంజనీర్స్‌ జేఏసీ

నెల్లూరులో సర్వసభ్య సమావేశం


నెల్లూరు, జనవరి 24 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని అన్ని ఇంజనీరింగ్‌ శాఖల్లో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించా లని ఆంధ్రప్రదేశ్‌ ఇంజనీర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ప్రభు త్వాన్ని కోరింది. ఆ కమిటీ సర్వసభ్య సమావేశం ఆదివారం నెల్లూరులోని హరిత టూరిజం హోటల్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఇంజనీర్స్‌ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కాకి విజయ్‌బాబు మాట్లాడుతూ జలవనరుల శాఖలో ప్రతి డివిజన్‌కు ఓ డీఈఈను నియమించాలని,  ఖాళీగా ఉన్న లష్కర్లు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్ల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. జేఏసీ ఉపాధ్యక్షుడు జీ కృష్ణ మాట్లాడుతూ ఆర్‌అండ్‌బీ శాఖలో వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, గ్యాంగ్‌మెన్ల పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఏఈ, ఏఈఈలకు కూడా వాహన సదుపాయాన్ని సమకూర్చాలని ప్రధాన కార్యదర్శి సమిట్ట శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. చీఫ్‌ ఇంజనీర్‌ ఏఎస్‌ఎన్‌ రాజు మాట్లాడుతూ ప్రతి ఇంజనీరింగ్‌ శాఖలోని యువ ఇంజనీర్లకు శిక్షణతోపాటు సలహాలు, సూచనలు అవసరమని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ఇంజనీర్లు పాల్గొన్నారు.  

Updated Date - 2021-01-25T05:44:11+05:30 IST