ప్రభుత్వం కుట్ర చేస్తోంది... 9 నుంచి ఉద్యమం: బొప్పరాజు

ABN , First Publish Date - 2022-01-04T02:17:56+05:30 IST

తమ సమస్యలపై ప్రభుత్వంతో జరిపిన చర్చలపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మొక్కుబడిగా భేటీలకు పిలిచారని, అధికారులు తమను ..

ప్రభుత్వం కుట్ర చేస్తోంది... 9 నుంచి ఉద్యమం: బొప్పరాజు

అమరావతి: తమ సమస్యలపై ప్రభుత్వంతో జరిపిన చర్చలపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మొక్కుబడిగా భేటీలకు పిలిచారని, అధికారులు తమను అవమానిస్తున్నాయని మండిపడుతున్నాయి. ఉద్యోగుల బకాయిలు రూ.1600 కోట్ల నుంచి రూ.2100 కోట్లకు పెరిగాయని ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు అన్నారు. బకాయిలు మార్చిలోగా చెల్లిస్తామంటున్నారని, రూ.100 కోట్లు ఇచ్చి రూ.2000 కోట్ల బిల్లులు వెనక్కి పంపాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. తమను  సీఎం దగ్గరకు తీసుకెళ్లకుండా అధికారులు ఎందుకు దోబూచులాడుతున్నారని మండిపడ్డారు.  రాష్ట్ర కార్యవర్గ భేటీ జరిపి ఈ నెల 9 నుంచి ఉద్యమాన్ని ప్రారంభిస్తామని బొప్పరాజు హెచ్చరించారు. 

Updated Date - 2022-01-04T02:17:56+05:30 IST