ఉద్యోగులకు న్యాయం చేస్తామన్న సీఎం మోసం చేశారు: వెంకటేశ్వర్లు

ABN , First Publish Date - 2022-01-27T19:39:04+05:30 IST

ఉద్యోగులకు న్యాయం చేస్తామన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని...

ఉద్యోగులకు న్యాయం చేస్తామన్న సీఎం మోసం చేశారు: వెంకటేశ్వర్లు

విజయవాడ: ఉద్యోగులకు న్యాయం చేస్తామన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని యూటీఎఫ్ రాష్ట్ర నాయకుడు వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం విజయవాడ, గాంధీనగర్‌లోని ధర్నా చౌక్‌లో ఉద్యోగులు చేస్తున్న నిరాహార దీక్షల్లో యూటీఎఫ్ నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు బయట వారిని తిట్టిన సీఎం..ఇప్పుడు ఇంట్లో వారిని తిడుతున్నారన్నారు. యుద్దం ప్రారంభమైతే.. ప్రభువులు గెలిచిన చరిత్ర ఎక్కడా లేదన్నారు. ప్రజలదే విజయమన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోను ప్రజల్లోకి  తీసుకెళ్లి ఎలా అమలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.


ఏటా జాబ్ కేలండర్ అని సీఎం అన్నారు.. ఎక్కడ ఇచ్చారో చెప్పాలని వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ప్రభుత్వం  ప్రతి ఏటా డీఎస్సీ వేస్తామంది.. కానీ ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వలేదని వెంకటేశ్వర్లు విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 26వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, భర్తీ చేయకుండా సీఎం నిలిపేశారన్నారు. ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయుల డేటా తీసి ఆస్తుల వివరాలు విచారిస్తున్నారని, మనం కూడా ఎమ్మెల్యేల ఆస్తుల  వివరాలు తీసి ప్రజలకు చెప్పాలన్నారు. ఉద్యోగులను భయపెట్టే ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే లేదని వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.

Updated Date - 2022-01-27T19:39:04+05:30 IST