ఏపీ ఈఏపీ సెట్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2022-07-05T04:39:25+05:30 IST

ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఈఏపీ సెట్‌ సోమవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. ఈ నెల 11 వరకు ఈ సెట్‌ నిర్వహించనున్నారు.తొలిరోజు జిల్లాలో మూడు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. 1407 మంది అభ్యర్థులకుగానూ 1,341 మంది హాజరయ్యారు. 66 మంది గైర్హాజరయ్యారు.

ఏపీ ఈఏపీ సెట్‌ ప్రారంభం
అభ్యర్థుల గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్న సిబ్బంది

జిల్లాలో తొలిరోజు 1341 మంది హాజరు
ఎచ్చెర్ల/టెక్కలి, జూలై 4:
ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఈఏపీ సెట్‌ సోమవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. ఈ నెల 11 వరకు ఈ సెట్‌ నిర్వహించనున్నారు. ఈ నెల 8వ తేదీ వరకు ఇంజనీరింగ్‌ స్ర్టీమ్‌లో.., 10, 11 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. తొలిరోజు జిల్లాలో మూడు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. 1407 మంది అభ్యర్థులకుగానూ 1,341 మంది హాజరయ్యారు. 66 మంది గైర్హాజరయ్యారు. చిలకపాలెంలోని శ్రీ శివానీ ఇంజనీరింగ్‌ కళాశాలలో 409 మందికి 392 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఎచ్చెర్లలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్‌ కళాశాలలో 401 మందికి గానూ 389 మంది పరీక్ష రాశారు. టెక్కలిలోని ఆదిత్య ఇంజనీరింగ్‌ కళాశాలలో 597 మందికి 560 అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. నిబంధనల మేరకు అధికారులు తనిఖీలు చేసి.. పరీక్షా కేంద్రాల్లోని అభ్యర్థులను అనుమతించారు. టెక్కలిలో పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లును డైరెక్టర్‌ వీవీ నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు సమకూర్చారు.

అంబేడ్కర్‌ వర్సిటీలో కొత్త కోర్సులు
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో ఈ ఏడాది నుంచే కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నట్టు వీసీ ప్రొఫెసర్‌ నిమ్మ వెంకటరావు తెలిపారు. వర్సిటీలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఉద్యోగ, ఉపాధి కల్పనకు అనుకూలంగా పీజీ డిప్లమో కోర్సులను ప్రవేశపెడుతున్నాం. ఎన్‌ఏసీఎల్‌, అరబిందో, కృష్ణపట్నం పోర్టు అధికారులతో ఇప్పటికే ఎంవోయూ పూర్తయింది. కోర్సుకు సంబంధించి సిలబస్‌ కూడా నిర్ణయించాం. పరిశ్రమలు, విద్యాసంస్థల అనుసంధానంతో వివిధ కోర్సులు నిర్వహించాలన్న ఉద్దేశంతో ఈ కోర్సులను ప్రారంభిస్తున్నాం. కొత్త కోర్సుల ఏర్పాటుపై ఇటీవల వీసీల కాన్పరెన్స్‌లో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖాధికారులు అభినందించారు. జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా డిగ్రీ రెండో సంవత్సరం విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ అమలు కోసం జిల్లాస్థాయిలో కలెక్టర్‌ అధ్యక్షతన ఓ కమిటీ ఏర్పాటైంది. ఈ నెల 14,15 తేదీల్లో సమావేశమై విధివిధానాలు నిర్దేశిస్తామ’ని తెలిపారు. ఈ నెలలో వర్సిటీని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ  సందర్శించనున్నారని, ఇందుకోసం నివేదిక సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.  

 

Updated Date - 2022-07-05T04:39:25+05:30 IST