Abn logo
Jul 19 2021 @ 20:34PM

ఏపీ డిప్యూటీ సీఎం మేనల్లుడు నిఖిల్ ఆత్మహత్య

నెల్లూరు: డిప్యూటీ సీఎం నారాయణస్వామి‌ మేనల్లుడి ఆత్మహత్య సూళ్లూరుపేటలో కలకలం రేగింది. స్థానిక కీర్తి ఎన్‌క్లేవ్‌లో నిఖిల్ (27) బలవన్మరణానికి పాల్పడ్డారు. నిఖిల్ శ్రీసిటీలోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. సోమవారం నిఖిల్ ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిఖిల్ కుబుంబ సభ్యులకు సమాచారం అందించారు. నిఖిల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే నిఖిల్ ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిఖిల్ ప్రవర్తనపై స్థానికుల నుంచి సమాచారం సేకరించారు. పలు కోణాల్లో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరింత సమాచారం విచారణ తర్వాత పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.