'బుల్లెట్ బండి' పాటకు స్టెప్పులేసిన ఉప ముఖ్యమంత్రి సతీమణి

ABN , First Publish Date - 2021-09-16T23:29:24+05:30 IST

ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి వివాహ వార్షికోత్సవం తిరుపతిలో ఘనంగా జరిగింది. 42వ పెళ్లిరోజు సందర్భంగా ఆయన నివాసంలో వేడుకలు

'బుల్లెట్ బండి' పాటకు స్టెప్పులేసిన ఉప ముఖ్యమంత్రి సతీమణి

తిరుపతి: ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి వివాహ వార్షికోత్సవం తిరుపతిలో ఘనంగా జరిగింది. 42వ పెళ్లిరోజు సందర్భంగా ఆయన నివాసంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో 'బుల్లెట్ బండి' పాటకు నారాయణస్వామి అర్ధాంగి స్టెప్పులేయడం విశేషం. నారాయణస్వామి సోఫాలో కూర్చుని ఉండగా, ఆమె 'బుల్లెట్ బండి' పాటకు చక్కని అభినయంతో డ్యాన్స్ చేశారు. ఇతర కుటుంబ సభ్యులు కూడా ఆమెతో కాలు కదపడంతో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.


Updated Date - 2021-09-16T23:29:24+05:30 IST