మర్కజ్‌ సమావేశాలకు హాజరై.. మరుసటి రోజే జగన్‌‌ను కలిసిన డిప్యూటీ సీఎం!

ABN , First Publish Date - 2020-04-01T02:06:14+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలోని మర్కజ్ మసీదు సమావేశాలకు సంబంధించి కొత్త కోణం వెలుగుచూసింది...

మర్కజ్‌ సమావేశాలకు హాజరై.. మరుసటి రోజే జగన్‌‌ను కలిసిన డిప్యూటీ సీఎం!

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని మర్కజ్ మసీదు సమావేశాలకు సంబంధించి కొత్త కోణం వెలుగుచూసింది. మర్కజ్‌ సమావేశాలకు ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా హాజరయ్యారని తెలుస్తోంది. ప్రధాన సమావేశాలకు ముందు జరిగిన తొలి సమావేశాల్లో ఆయన పాల్గొన్నారని సమాచారం.


మరుసటి రోజే జగన్‌తో భేటీ..!

ఆ తర్వాత రోజు ఎన్‌పీఆర్‌పై ముస్లిం మతపెద్దలతో కలిసి సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిని అంజాద్‌బాషా కలిశారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎన్‌పీఆర్ వద్దంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని జగన్‌ను డిప్యూటీ సీఎం, మతపెద్దలు కోరారని సమాచారం. కాగా.. ఈ మర్కజ్ సమావేశాలకు హాజరయ్యేందుకు గాను బెంగళూరు నుంచి ఒకరోజే ముందే డిప్యూటీ సీఎం ఢిల్లీ వెళ్లారని తెలుస్తోంది. ఆ మరుసటి రోజు సమావేశాల్లో పాల్గొన్నారని సమాచారం.


ఇవాళే కడపలో సమావేశం..

ఇదిలా ఉంటే.. ఇవాళ కడప జిల్లాలో కరోనా వైరస్ నియంత్రణ, నివారణ కోసం చేపట్టాల్సిన చర్యలు, సంసిద్ధతపై జిల్లా కలెక్టర్ హరికిరణ్ ఆధ్వర్యంలో సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం అంజద్ బాష, ఇంఛార్జి జిల్లా మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు హాజరయ్యారు.







Updated Date - 2020-04-01T02:06:14+05:30 IST