2024 నాటికి ఏపీ అప్పు ఎంతంటే..: యనమల

ABN , First Publish Date - 2022-03-21T21:35:59+05:30 IST

రాబోయే 2024 నాటికి ఏపీ అప్పు రూ.8 లక్షల కోట్లకు చేరుతుందని టీడీపీ

2024 నాటికి ఏపీ అప్పు ఎంతంటే..: యనమల

అమరావతి: రాబోయే 2024 నాటికి ఏపీ అప్పు రూ.8 లక్షల కోట్లకు చేరుతుందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. మీడియాతో ఆయన ఇక్కడ మాట్లాడారు. ఏపీ 2024 ఏడాదికి రూ. లక్ష కోట్ల మేర చెల్లింపులు జరపాలని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ పరిధి మేరకు చేసే అప్పులను మాత్రమే చూపారన్నారు. వివిధ కార్పొరేషన్ల నుంచి ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కింద రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున అప్పులు చేస్తుందని ఆయన ఆరోపించారు. లబ్దిదారులకు కేవలం రూ.9 వేల కోట్లు మాత్రమే నేరుగా నగదు అందుతోందన్నారు. కానీ ప్రభుత్వం రూ.50 వేల కోట్ల నగదు బదిలీ చేసినట్టు చెప్పుకుంటోందని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో రూ. 27 వేల కోట్లు డీబీటీ ద్వారా పేదలకు ఇచ్చినట్టు బడ్జెట్ లెక్కల్లో చూపామని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2022-03-21T21:35:59+05:30 IST