అంగన్‌వాడీ పాలకు ధరపెంపు

ABN , First Publish Date - 2020-02-22T08:48:03+05:30 IST

ఏపీ డెయిరీ డెవల్‌పమెంట్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌ నుంచి అంగన్‌వాడీలకు సరఫరా చేసే పాల ధరను పెంచుతూ మహిళా, శిశు సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీచేసింది.

అంగన్‌వాడీ పాలకు ధరపెంపు

అమరావతి, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): ఏపీ డెయిరీ డెవల్‌పమెంట్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌ నుంచి అంగన్‌వాడీలకు సరఫరా చేసే పాల ధరను పెంచుతూ మహిళా, శిశు సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీచేసింది. గిట్టుబాటు ధరలు కల్పించకపోవడంతో ఏపీ డెయిరీ అంగన్‌వాడీలకు పాల సరఫరాను నిలిపేశారంటూ ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో కథనం వచ్చింది. దీనికి స్పందించిన మహిళా శిశు సంక్షేమశాఖ ఆ మేరకు చర్యలు తీసుకుంది. కాగా, ప్రభుత్వ ఉత్తర్వుల్లో పాల ధర పెంచుతున్నట్లు పేర్కొన్నా.. బ్లాంక్‌ జీఓ ఇవ్వడం గమనార్హం!.

Updated Date - 2020-02-22T08:48:03+05:30 IST