ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని పదవీ కాలం పొడిగింపు

ABN , First Publish Date - 2020-06-03T21:57:45+05:30 IST

ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నీలం సాహ్ని పదవీ కాలం మూడునెలలు పొడిగిస్తున్నట్లు కేంద్రం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని పదవీ కాలం పొడిగింపు

ఢిల్లీ: ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నీలం సాహ్ని పదవీ కాలం మూడునెలలు పొడిగిస్తున్నట్లు కేంద్రం ఉత్తర్వుల్లో పేర్కొంది. నీలం సాహ్ని పదవీకాలం పొడిగించాలని ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. జులై 1వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 30వరకు సాహ్ని పదవికాలాన్ని కేంద్రం పొడిగించింది. గత ఏడాది నవంబర్ 13న నీలం సాహ్ని ఏపీ సీఎస్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె కేంద్ర సర్వీసులు నుంచి రిలీవ్ అయి ఏపీ సీఎస్‌గా భాద్యతల చేపట్టింది. 


అంతకుముందు ఏపీ సీఎస్‌గా పనిచేస్తున్న ఎల్వీ సుబ్రహ్మణ్యంను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో నీరబ్ కుమార్‌ప్రసాద్ తాత్కాలికంగా భాద్యతలు అప్పగించారు. ఆ తర్వాత సాహ్ని ఏపీ సీఎస్‌గా పూర్తిస్థాయిలో భాద్యతలు చేపట్టారు. 1984వ ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన నీలం సాహ్ని ఉమ్మడి ఏపీలో సుదీర్ఘ కాలం పనిచేశారు. ఉమ్మడి ఏపీలో మచిలీపట్నం అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. అంతేకాకుండా నల్గొండ జాయింట్ కలెక్టర్‌, కలెక్టర్‌గా పనిచేశారు. ముస్సిపల్ పరిపాలన విభాగం డిప్యూటీ సెక్రటరీగా, శిశు సంక్షేమశాఖ పీడీగా పనిచేశారు. 

Updated Date - 2020-06-03T21:57:45+05:30 IST