Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘జగన్ గారు మాట నిలబెట్టుకోండి’

విశాఖ: సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నిరసన చేపట్టారు. సీఎం జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా సీపీఎస్ ఉద్యోగులు ఉద్యమబాట పట్టారు. ఈ సందర్బంగా వారు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ సీపీఎస్ అనేది ప్రభుత్వ ఉద్యోగుల పాలిట శాపమని అన్నారు. ఆ శాపం 2004 సెప్టెంబర్ 1 ప్రారంభమైందని.. అందుకే ఇవాళ నిరసనదినంగా పాటిస్తున్నామని చెప్పారు.


గత ప్రభుత్వాలు సీపీఎస్ గురించి మాట్లాడలేదన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో సీపీఎస్ రద్దు చేస్తామని, ఉద్యోగులకు తోడుగా ఉంటామని చెప్పడంతో తాము నమ్మామని ఉద్యోగులు తెలిపారు. ఇప్పటికీ నమ్ముతున్నామన్నారు. జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. కమిటీలతో కాలయాపన చేయకుండా త్వరగా చేయాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1లక్ష 94వేల మంది సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారు.

Advertisement
Advertisement