Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏపీలో COVID Update..

గుంటూరు: కరోనా నివారణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఏపీలో కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. రాష్ట్రంలో శుక్రవారం రోజు కొత్తగా 1,746 కరోనా కేసులు నమోదవగా, కోవిడ్ 20 మంది మృతి చెందారని వైద్య శాఖ పేర్కొంది. ఏపీలో మొత్తం 19,90,656 పాజిటివ్‌ కేసులు నమోదవగా, రాష్ట్రంలో కోవిడ్ వల్ల మొత్తం 13,615 మంది మరణించారు. ఏపీలో ప్రస్తుతం మొత్తం 18,766 యాక్టివ్‌ కేసులు ఉండగా, 19,58,275 మంది రికవరీ అయ్యారు. గత 24 గంటల్లో 73,341 శాంపుల్స్‌ సేకరించినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇవాళ కోవిడ్ నుంచి 1,648 మంది రికవరీ అయినట్లు ప్రభుత్వం పేర్కొంది.

Advertisement
Advertisement