Abn logo
Jul 12 2020 @ 15:17PM

ఏపీ కరోనా కేసులు...తాజా అప్‌డేట్

అమరావతి: ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 30 వేలకు చేరువలోకి వచ్చింది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,933 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందినవారు 1,914 మంది ఉండగా..ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 18 మంది ఉన్నారు. ఇక విదేశాల నుంచి వచ్చినవారు ఒకరు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 29,168కి చేరింది. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఇతర దేశాలవారు 429 మంది, ఇతర రాష్ట్రాల వారు 2403 మంది ఉన్నారు. రాష్ట్రానికి చెందినవారు 26,336 మంది కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,428 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. ఈరోజు డిశ్ఛార్జి అయిన 846 మందితో కలిపి మొత్తంగా 15,412 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 328 మంది చనిపోయారు. అందులో ఈరోజు మృతి చెందినది 19 మంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 11,53,849 మంది కరోనా పరీక్షలు చేశారు. గత 24 గంటల్లో 17,624 మందికి పరీక్షలు చేశారు. 


Advertisement
Advertisement
Advertisement