సిద్ధంగా ఉండండి.. సీఎం జగన్ ఆదేశం

ABN , First Publish Date - 2021-12-28T02:04:46+05:30 IST

ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ పిలుపు నిచ్చారు. కొవిడ్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ఇంటింటికీ ..

సిద్ధంగా ఉండండి.. సీఎం జగన్ ఆదేశం

తాడేపల్లి: ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ పిలుపు నిచ్చారు. కొవిడ్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్‌ చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో 6 ఒమైక్రాన్‌ కేసులు నమోదు అయ్యాయని సీఎం జగన్‌కు అధికారులు తెలిపారు. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా వారికి సీఎం జగన్ సూచించారు. వైద్య ఆరోగ్యశాఖలో జనరల్‌ బదిలీలు చేపట్టాలని,  కొత్త రిక్రూట్‌మెంట్లను కూడా పూర్తి చేయాలని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశించారు. 

Updated Date - 2021-12-28T02:04:46+05:30 IST