హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు ఆగష్టు 25కు వాయిదా వేసింది. కేసుకు సంబంధించి ఈరోజు సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. కోర్టు విచక్షణ అధికారాలకే నిర్ణయం వదిలేసామంటూ దాఖలు చేసిన మెమోను పరిగణలోకి తీసుకోవాలంటూ కోర్టును సీబీఐ కోరింది. కాగా ఇప్పటికే జగన్ తరపు న్యాయవాదులు, పిటిషనర్ రఘురామకృష్ణం రాజు లాయర్లు లిఖితపూర్వకమైన వాదనలు కోర్టుకు సమర్పించారు. ఈ మూడింటిని పరిగణలోకి తీసుకున్న అనంతరం ఆగష్టు 25న కోర్టు తీర్పును వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో జగన్, పిటిషనర్ తరపు న్యాయవాదులు రిజైండర్ వేసినప్పటికీ సీబీఐ అధికారులు మాత్రం కేవలం కోర్టుకు విచక్షణ అధికారం వదిలేస్తున్నామని... బెయిల్ రద్దు చేయాలా వద్దా అనే అంశానికి సంబంధించి న్యాయపరమైన చర్యలు కోర్టే తీసుకోవాలని రిజైండర్‌లో పేర్కొన్నారు. అదే విషయాన్ని ఆన్ రికార్డుల్లోకి తీసుకోవాలని ఈరోజు సీబీఐ తరపు న్యాయవాదలు వాదనలు వినిపించారు. వాదనలు విన్న కోర్టు విచారణను ఆగష్టు 25కు వాయిదా వేసింది. అదే రోజు తీర్పు వెలువడే అవకాశాలు స్పష్టం కనిపిస్తున్నట్లు సమాచారం.