సీఎస్‌కు ఫోన్‌ చేసిన రఘురామ భార్య.. మారిన సీన్

ABN , First Publish Date - 2021-05-18T00:00:00+05:30 IST

ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్‌కు ఎంపీ రఘురామకృష్ణ రాజు భార్య రమాదేవి ఫోన్ చేశారు. తన భర్తకు జైలులో ప్రాణహాని ఉందని,

సీఎస్‌కు ఫోన్‌ చేసిన రఘురామ భార్య.. మారిన సీన్

గుంటూరు: ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్‌కు ఎంపీ రఘురామకృష్ణ రాజు భార్య రమాదేవి ఫోన్ చేశారు. తన భర్తకు జైలులో ప్రాణహాని ఉందని, సుప్రీంకోర్టు తీర్పు సీఐడీకి వ్యతిరేకంగా రావడంతో.. కక్ష పెంచుకునే అవకాశం ఉందని తెలిపారు. తక్షణమే రఘురామను ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో వెంటనే స్పందించిన సీఎస్.. గంటలోనే ఎస్కార్ట్ ఏర్పాటు చేసి పంపుతామని చెప్పారు. అప్పటి వరకు జాప్యం చేసే ధోరణిలో కనిపించిన ప్రభుత్వ వర్గాలు రఘురామను హైదరాబాద్ తరలించేందుకు రంగం సిద్ధం చేశాయి. 


గుంటూరు జైలు దగ్గరకు ఎస్కార్ట్‌, వై కేటగిరి సిబ్బంది చేరుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను జైలు అధికారులకు పోలీసులు అందజేశారు. రఘురామకు పోలీస్‌ ఎస్కార్ట్‌తో పాటు సీఆర్పీఎఫ్‌ రక్షణ కల్పించారు. రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రికి రఘురామ చేరుకోనున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. జ్యుడీషియల్‌ ఆఫీసర్‌ను తెలంగాణ హైకోర్టు నియమించింది. రఘురామ ఆర్మీ ఆస్పత్రికి చేరుకునే సమయానికి.. జ్యుడీషియల్‌ ఆఫీసర్‌ను అక్కడికి పంపే అవకాశం ఉంది. కాసేపట్లో హైదరాబాద్‌ రఘురామకృష్ణరాజు బయల్దేరనున్నారు. 


Updated Date - 2021-05-18T00:00:00+05:30 IST