LIVE: తెరవెనుక ఏపీ రాజధాని తరలింపు

ABN , First Publish Date - 2020-07-08T13:28:23+05:30 IST

LIVE: తెరవెనుక ఏపీ రాజధాని తరలింపు

LIVE: తెరవెనుక ఏపీ రాజధాని తరలింపు

అమరావతి: అమరావతి రాజధాని తరలింపు ప్రక్రియను తెరవెనుక ప్రభుత్వం చేపడుతోంది అనే వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే కూడా అదే భావన కలుగుతోంది. ప్రభుత్వం అంబేద్కర్ స్మృతి వనాన్ని అమరావతి నుంచి విజయవాడకు తీసుకురావడం కావచ్చు...చాలా కార్యాలయాలకు సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి..సీఎం కార్యాలయాలకు సంబంధించిన అధికారులు, డీజీపీ వైజాగ్‌కు వెళ్లి అక్కడ పరిశీలన చేసి రావడం కావొచ్చు...ఇప్పటికే చాలా శాఖలకు సంబంధించిన అధిపతులకు కార్యాలయాల తరలింపు, రాజధాని పూర్తిగా అక్కడకు తరలింపు జరుగుతుందని అనే భావన కలిగించడం వంట చూస్తుంటే..తెరవెనుక ప్రభుత్వం రాజధాని తరలింపు ప్రక్రియను మొదలుపెట్టింది అనే ఆలోచనను కలిగిస్తోంది. అంతే కాదు ఒకవైపు కోర్టులు, శాసనమండలిలో రాజధాని అంశానికి సంబంధించి పెండింగ్‌లో ఉంది. కోర్టుల్లో కూడా చాలా పిటిషన్లు ఉన్నాయి. వీటన్నింటినీ పక్కన పెట్టి తెరవెనుక ప్రభుత్వం సీఎం కార్యాలయాన్ని, మిగితా శాఖలను అక్కడకు తరలించే  ప్రయత్నం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఏబీఎన్ మార్నింగ్  ఇష్యూలో చర్చ చేపట్టారు. ఈ చర్చలో బీజేపీ నేత వల్లూరి జయప్రకాష్, టీడీపీ నేత రామకృష్ణ ప్రసాద్, సీపీఎం నేత రాంభూపాల్, కాంగ్రెస్ నేత సామరామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. చర్చను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి. 


Updated Date - 2020-07-08T13:28:23+05:30 IST