ఒంగోలు: అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర తొమ్మిదవ రోజుకు చేరుకుంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో మహా పాదయాత్ర జరుగుతోంది. తొమ్మిదవ రోజు ప్రకాశం జిల్లా ఇంకొల్లు నుంచి పాదయాత్రం ప్రారంభంకానుంది. తొమ్మిదవ రోజు ఇంకొల్లు నుంచి దుద్దుకూరు వరకు యాత్ర సాగనుంది. పర్చూరు నియోజకవర్గంలో పాదయాత్రకు స్థానికులు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. పాదయాత్రకు వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీల సంఘీభావం తెలిపాయి.