Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏపీ రాజధానిపై మరోసారి మాటమార్చిన కేంద్రం

ఢిల్లీ: ఏపీ రాజధానిపై కేంద్రం మరోసారి మాటమార్చింది. ఏపీ రాజధాని విశాఖ అంటూ లోక్‌సభ సాక్షిగా కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఏపీ రాజధానిగా వైజాగ్‌ను కేంద్రం సూచించింది. పెరిగిన పెట్రోల్‌ ధరల ప్రభావం రాష్ట్రాల్లో అంచనా వేశారా అంటూ... ఎంపీ కుంభకుడి సుధాకరన్ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. ప్రధాన నగరాల్లో పెరిగిన పెట్రోల్ ధరలను కేంద్రం అంచనా వేసింది. అయితే కేంద్రం విడుదల చేసిన రాజధానుల పట్టికలో ఏపీ రాజధానిగా విశాఖగా పేర్కొంది. గతంలో ఏపీ రాజధాని అంశం న్యాయపరిధిలో ఉందని కేంద్రం చెప్పింది. న్యాయపరిధిలో ఉన్న అంశాన్ని లోక్‌సభలో ప్రస్తావించడాన్ని అమరావతి జేఏసీ వ్యతిరేకిస్తోంది. ఏపీ రాజధానిపై చాలాకాలంగా రగడ నడుస్తోంది. మూడు రాజధానుల అంశంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తోంది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని జేఏసీతో పాటు పలు సంఘాలు చాలాకాలంగా ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. 

Advertisement
Advertisement