AP కేబినేట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం..

ABN , First Publish Date - 2022-06-24T17:23:54+05:30 IST

ఏపీ (AP) కేబినెట్ సమావేశమైంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.

AP కేబినేట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం..

అమరావతి (Amaravathi): ఏపీ (AP) కేబినెట్ సమావేశమైంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. దేవాదాయ భూముల ఆక్రమణల నిరోధానికి చట్ట సవరణ ప్రతిపాదనపై చర్చ జరగనుంది. పంచాయతీరాజ్ చట్టంలో సవరణకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అజెండాలో అదాని గ్రీన్ ఎనర్జీ చేపట్టనున్న 3,700 మెగావాట్ల పంప్‌డ్‌ స్టోరేజీ ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలపనుంది.


జెడ్పీ చైర్మన్లను కొత్త జిల్లాలకు కొనసాగించేలా కేబినెట్ చట్ట సవరణను ఆమోదించే అవకాశముంది. ఈ నెల 27న అమ్మఒడి నిధుల విడుదలకు మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది. అలాగే 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీపైనా చర్చించే అవకాశముంది. 35 సంస్థలకు 112 ఎకరాల భూ కేటాయింపులకు  ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. పులివెందులలో రూ.50 కోట్లతో పంక్చుయేట్‌ వరల్డ్‌ సంస్థ గార్మెంట్స్‌ పరిశ్రమ పెట్టనుంది. దీనికి కేబినెట్ గ్నీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అలాగే కొప్పర్తిని టెక్స్‌టైల్‌ రీజియన్‌ అపారెల్‌ పార్క్‌ చేసే ప్రతిపాదనపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Updated Date - 2022-06-24T17:23:54+05:30 IST