దేవాలయాల వద్ద అన్యమత చిహ్నాలను తొలగించాలి: బీజేపీ

ABN , First Publish Date - 2022-01-29T23:53:55+05:30 IST

హిందూ దేవాలయాల వద్ద అన్యమత చిహ్నాలు వెంటనే తొలగించాలని

దేవాలయాల వద్ద అన్యమత చిహ్నాలను తొలగించాలి: బీజేపీ

అమరావతి: హిందూ దేవాలయాల వద్ద అన్యమత చిహ్నాలు వెంటనే తొలగించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ  దేవాలయాల వద్ద అన్యమత చిహ్నాలు ఉండడం దారుణమన్నారు. ప్రకాశం జిల్లాలోని పెద్దారవీడు మండలం రాజంపల్లి గ్రామంలో తిరుమల స్వామి దేవాలయం దగ్గర అన్యమత చిహ్నాలు తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. శతాబ్దాలుగా సంతానం కలగని దంపతులకు ఇక్కడ కొచ్చి గిరి ప్రదక్షిణ చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అనే విశ్వాసం ఉందన్నారు. గొడ్డలి కొండ దగ్గర కొంతమంది అన్యమతస్తులు చర్చ్ కట్టడాన్ని ప్రారంభించారని ఆయన తెలిపారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేపడుతున్న కట్టడాల నిర్మాణాలని తక్షణం నిలుపుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు స్థానిక బీజేపీ నాయకులు దశలవారీగా పోరాటం చేస్తారని ఆయన పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం చర్య తీసుకోకపోతే బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆందోళనకు సిద్ధమవుతోందని ఆయన తెలిపారు. 


Updated Date - 2022-01-29T23:53:55+05:30 IST