ఉద్యోగ క్యాలెండర్‌ కంటితుడుపు చర్య

ABN , First Publish Date - 2021-06-20T05:49:53+05:30 IST

ప్రభుత్వం జారీ చేసిన జాబ్‌క్యాలెండర్‌ కంటితుడుపు చర్యలేనని, రాష్ట్రవ్యాప్తంగా 2లక్షల మంది నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురు చూసినా నిరాశే ఎదురైందని బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కుర్రం శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

ఉద్యోగ క్యాలెండర్‌ కంటితుడుపు చర్య
మాట్లాడుతున్న కుర్రం శ్రీనివాస్‌

గుంటూరు(విద్య),జూన్‌ 19: ప్రభుత్వం జారీ చేసిన జాబ్‌క్యాలెండర్‌ కంటితుడుపు చర్యలేనని, రాష్ట్రవ్యాప్తంగా 2లక్షల మంది నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురు చూసినా నిరాశే ఎదురైందని బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కుర్రం శ్రీనివాస్‌ పేర్కొన్నారు.  శనివారం గుంటూరులో  ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  పూర్తిస్థాయి జాబ్‌ నోటిఫికేషన్లు జారీ చేయకుంటే జూలై నెల మొదటివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. డీఎస్సీ, ఏపీపీపీఎస్సీ, గ్రూపు 2, పోలీసు, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు, ఎండోమెంట్‌, గ్రంథాలయాల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అయితే ఆయా పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేయకుండా పదివేల పోస్టులతో నోటిఫికేషన్లు జారీచేసి నిరుద్యోగుల ఆశలపై ప్రభుత్వం నీళ్ళు చల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు.  

  


Updated Date - 2021-06-20T05:49:53+05:30 IST