అమరావతి: ఏపీ శాసనసభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈరోజు ఉదయం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2022-23 వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. మంత్రి బుగ్గన బడ్జెట్‌పై ప్రసంగిస్తున్న సమయంలో టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు. బడ్జెట్‌లో అన్నీ అబద్దాలు చెబుతున్నారని టీడీపీ ఆందోళనకు దిగింది. బడ్జెట్ అంతా తప్పులతడక అంటూ నినాదాలు చేశారు. దీంతో టీడీపీ సభ్యులపై వైసీపీ ఎమ్మెల్యేలు ఎదురుదాడికి దిగారు. ప్రతిపక్ష వైఖరిపై స్పీకర్ తమ్మినేని అసహనం వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రసంగం తర్వాత అభ్యంతరాలు చెప్పాలని స్పీకర్ తెలిపారు. అవసరమైతే సభ నుంచి బయటకు వెళ్లిపోవాలని టీడీపీ సభ్యులను ఉద్దేశించి మంత్రి బుగ్గన వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి