అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ABN , First Publish Date - 2022-03-17T16:27:32+05:30 IST

అసెంబ్లీ నుంచి వరుసగా మూడో రోజు టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్ష‌కు గురయ్యారు.

అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

అమరావతి: అసెంబ్లీ నుంచి వరుసగా మూడో రోజు టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్ష‌కు గురయ్యారు. గురువారం ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి జే బ్రాండ్స్ మద్యం, నాటుసారాతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. సభలో చప్పట్లు కొడుతూ నిరసన తెలిపారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది.  టీడీపీ సభ్యుల ఆందోళనపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం శాసనసభ్యులు ఒక్కరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారంటూ అసెంబ్లీలో ఉన్న టీడీపీ సభ్యులందరినీ సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. నిన్న సీఎం జగన్‌మోహన్‌ రెడ్డిపై ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసును ఆర్డర్‌లో లేదని తిరస్కరిస్తున్నట్టు తెలిపారు. అలాగే అసెంబ్లీలోకి సభ్యులు ఎవ్వరూ మొబైల్, ప్లాకార్డులు, రెచ్చగొట్టే ఇతర కార్యక్రమాలు చేపట్ట వద్దని రూల్ నెంబర్ 317లో చేర్చనున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. కాగా... స్పీకర్  రూలింగ్‌పై టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. 

Updated Date - 2022-03-17T16:27:32+05:30 IST