అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడవ రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈరోజు సభలో ఉద్యాన నర్సరీల సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అలాగే కులాలవారీగా జనగణన చేయాలనే తీర్మానాన్ని జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మరోవైపు అసెంబ్లీ, మండలి సమావేశాలకు టీడీపీ దూరంగా ఉండనుంది. నేటి నుంచి సభకు హాజరుకాకూడదని టీడీపీ నిర్ణయం తీసుకుంది.