AP అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-11-18T14:51:01+05:30 IST

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేవాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే సుధా ప్రమాణస్వీకారంతో ఏపీ అసెంబ్లీ మొదలైంది.

AP అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేవాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే సుధా ప్రమాణస్వీకారంతో అసెంబ్లీ మొదలైంది. ఈ సమావేశాల్లో 14 ఆర్డినెన్స్‌లను ప్రభుత్వం సభ ముందు ఉంచనుంది. మహిళా సాధికారతపై అసెంబ్లీ, మండలిలో చర్చ జరుగనుంది. ఒక్కరోజే సమావేశాలు నిర్వహించే యోచనలో సర్కార్‌ ఉన్నట్లు తెలుస్తోంది. బీఏసీలో అసెంబ్లీ సమావేశాల అజెండా, పనిదినాలపై చర్చించనున్నారు. కాగా అసెంబ్లీ సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఒక్కరోజే సమావేశం జరిపితే సభను టీడీపీ బహిష్కరించనుంది. 

Updated Date - 2021-11-18T14:51:01+05:30 IST