AP Assembly: వాయిదా అనంతరం ఏపీ అసెంబ్లీ ప్రారంభం

ABN , First Publish Date - 2022-09-15T16:28:38+05:30 IST

పది నిమిషాల వాయిదా అనంతరం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తిరిగి ప్రశ్నోత్తరాలను స్పీకర్ తమ్మినేని చేపట్టారు.

AP Assembly: వాయిదా అనంతరం ఏపీ అసెంబ్లీ ప్రారంభం

అమరావతి: పది నిమిషాల వాయిదా అనంతరం ఏపీ అసెంబ్లీ (AP Assembly) సమావేశాలు ప్రారంభమయ్యాయి. తిరిగి ప్రశ్నోత్తరాలను స్పీకర్ తమ్మినేని (Tammineni sitaram) చేపట్టారు. ఈ సందర్భంగా హలో అధ్యక్షా అంటూ మంత్రి అంబటి రాంబాబు (Ambati rambabu) సమాధానం ప్రారంభించారు. శ్రీశైలం డ్యాం స్పిల్ వే కిందభాగంలో 1998లో ఎక్కవ వరద వచ్చినప్పుడు పెద్ద గుంట ఏర్పడిందని... దాన్ని 2002 లో గుర్తించి పూడ్చడానికి రూ.15 కోట్లు ఇచ్చారని తెలిపారు. 2018లో రూ.5 కోట్లతో తాత్కాలిక మరమ్మత్తులకు కేటాయించారని తెలిపారు. 2019లో సీఎం జగన్(CM Jagan) అధికారంలోకి వచ్చాక గోతిని పూర్తిగా పూడ్చడానికి చర్యలు తీసుకున్నామని  అన్నారు. 


వారి బాధను అర్ధం చేసుకోవడంలో విఫలం అయ్యాం...

టీడీపీ (TDP) వారి భాదను మనం అర్ధం చేసుకోవడంలో విఫలం అయ్యామంటూ అంబటి రాంబాబు యెద్దేవా చేశారు. వారు ఏదో ఒక విధంగా సస్పెండ్ అయ్యి రావాల్సిందిగా చంద్రబాబు (Chandrababu naidu) వారిని పంపారన్నారు. మనం వారి భాదను అర్ధం చేసుకొని వారిని బయటకు పంపాల్సి ఉంటుందని... సభను జరగనివ్వకూడదనేది  వారి ఉద్దేశమని అన్నారు. సభను జరగనివ్వకుండా ఉండేందుకు చంద్రాబా (TDP Chief) ఆయన గ్యాంగ్‌ను పంపారని అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-09-15T16:28:38+05:30 IST