అక్టోబర్ 10 తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాలు!

ABN , First Publish Date - 2020-09-29T19:22:54+05:30 IST

అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

అక్టోబర్ 10 తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాలు!

అమరావతి : అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అక్టోబర్ 10 తర్వాత నిర్వహించాలని జగన్ సర్కార్ భావిస్తోంది. ఎల్లుండి అనగా గురువారం జరిగే కేబినెట్‌ సమావేశంలో నిశితంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ సమావేశంలో భాగంగా అసెంబ్లీ సమావేశాల్లో ఏయే విషయాలపై చర్చించాలి..? కొత్తగా ఏయే బిల్లులు సభలో ప్రవేశపెట్టాలి..? అనేదానిపై నిశితంగా చర్చించనున్నారు. 


కాగా.. జూన్‌లో బడ్జెట్ సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. శాసనసభలో బడ్జెట్‌ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కురసాల కన్నబాబు ప్రవేశ పెట్టారు. శాసనమండలిలో బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రవేశపెట్టిన విషయం విదితమే.

Updated Date - 2020-09-29T19:22:54+05:30 IST