Advertisement
Advertisement
Abn logo
Advertisement

AP: అసెంబ్లీలో ఇళ్ళ‌స్థ‌లాల‌ భూసేక‌ర‌ణ అంశంపై చ‌ర్చ‌

అమ‌రావ‌తి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరవరోజు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తర సమయాన్ని ప్రారంభించారు. ఇళ్ళ‌స్థ‌లాల‌ భూసేక‌ర‌ణ అంశంపై చర్చ కొన‌సాగుతోంది. దీనిపై డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణ‌దాసు మాట్లాడుతూ.. కోర్టు కేసులు 521 ఉన్నాయని, ఇళ్ల ప‌ట్టాల కోసం ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు రూ. 10 వేల‌ కోట్లు  ఖ‌ర్చు పెట్టామన్నారు. వివాదాలు ఉన్న ఇంటి స్ధలాల‌ విస్తీర్ణం 9 వేల ‌903 ఎక‌రాల ఏడు సెంట్లు భూమి ఉందని, ల‌బ్దిదారులు సుమారు 3 ల‌క్ష‌ల 71 వేల‌ మంది దీని కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ల్యాండ్ పూలింగ్‌లో 4,457 ఎకరాలు అందుబాటులో ఉన్నాయని, టిడ్కో ఇళ్ళు 2,500 వ‌ర‌కు ఉన్నాయని, వాటిని ద‌శ‌ల వారీగా పరిష్క‌రించి లబ్ధిదారులకు అందిస్తామన్నారు. ఇలాంటి పెద్ద కార్య‌క్ర‌మానికి అనేక ఇబ్బందులు వ‌స్తాయని, ఇళ్ళ నిర్మాణం పూర్తి కావావ‌డానికి అంద‌రం స‌హ‌క‌రించుకోవాలన్నారు. అటు కోర్టు కేసులు కూడా స‌త్వ‌రం ప‌రిష్కారం అయ్యేలా చూస్తామని ధ‌ర్మాన కృష్ణ‌దాస్ ప్రకటించారు.

Advertisement
Advertisement