Advertisement
Advertisement
Abn logo
Advertisement

మళ్లీ ‘మార్చి’లో 3 రాజధానుల బిల్లు: మంత్రి బాలినేని

కర్నూలు జిల్లా: ఏపీలో మూడు రాజధానుల బిల్లు మళ్లీ అసెంబ్లీలోకి ప్రవేశపెట్టేది ఎప్పుడనే విషయాన్ని రాష్ట్ర విద్యుత్, అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. మూడు రాజధానుల బిల్లును రానున్న మార్చిలో శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. కర్నూలు జిల్లా, శ్రీశైలం మల్లన్న దర్శనార్థం వచ్చిన మంత్రి బాలినేని ఈ విషయాన్ని వెల్లడించారు. మూడు రాజధానుల బిల్లులో కొన్ని అంశాలను సరిగా పెట్టలేకపోవడంతో వెనక్కి తీసుకోవడం జరిగిందన్నారు. వచ్చే ఏడాది మార్చి బడ్జెట్‌లో మళ్లీ బిల్లు ప్రవేశపెట్టడం జరుగుతుందని మంత్రి బాలినేని స్పష్టం చేశారు.


ఇటీవల జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లుపై వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. అయితే బిల్లులో కొన్ని సవరణలు చేసిన తర్వాత దాన్ని తిరిగి అసెంబ్లీలో ప్రవేశపెడతామని జగన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఆ బిల్లు ఎప్పుడు, కొత్త ప్రతిపాదనలు ఎలా ఉంటుంది.. అనే దానిపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో మంత్రి బాలినేని ఆ బిల్లు ఎప్పుడనే విషయాన్ని వెల్లడించి ఉత్కంఠకు బ్రేక్ వేశారు.

Advertisement
Advertisement